02/09/12

అవతార పురుషుడు


బాబు భజ్రంగి
పటేల్మని
కులం దాటిన ప్రేమికుల్ని

కడుపు దాటని పాపల్ని
పరశురాముడో
పరమ కంసుడో
అవతారమెత్తి
పొట్టన పెట్టుకున్నాడు
నికృష్ణుడు

పదిమందిలోనే
యీ పదేళ్ళూ
పటేలై
పంచాయితీలు
పెద్దరికాలు నెరిపాడు
దాక్కుని అణగదొక్కుకొని
నక్కి నక్కి
కలుగుళ్ళో క్యాంపుళ్ళో
కారాగార కర్మనుభవించింది
వాడి కల్కవతారానికందని మనమే

గోవుకీ గోధ్రాకీ
పుట్టినోడు కాదు
మతంలోనే మందిలోనే
గోవర్ధనగిరికి ముందు
కులానికి గోత్రానికి
పొట్ట చీల్చి పుట్టి
భూమిపై పగబట్టి
వామనుడై
కాంతిని విడగొట్టి
నిచ్చెన మెట్లకి వురేసి
వివర్ణం నిండిన తలల్ని
పటేలని వణికిపోయే మనల్ని
సరైన పాతాళంలోకే
తొక్కేస్తున్నాడు. 

No comments:

 
Add to Technorati Favorites