31/03/11

mEmavudaam

wrote some mad verse in telugu:

నీకూ నాకూ
మధ్య అడ్డుగోడై
ప్రేమా దోమా
యేదైనా వుంటే
కూల్చేద్దాం!
మనం మేమవుదాం
చేతనైనంత వెలమవుదాం
వాడికి మేతవుదాం
దేవ్డిల వెట్టవుదాం
రెచ్చిపోయి రెడ్డవదాం
అదందాం ఇదందాం
అదవదాం ఇదవదాం
అడ్డంగా నరికేద్దాం
యెవడూ దొరక్క పోతే
పోనీ పోతే
యీ ఫోరడి ప్రాణం
యింకో పోరడి ప్రాణం
ఆత్మహత్యై
ఊదుబత్తై
ఉద్యమ పద్దై
గల్లా యెగిరేసుకొని
చెప్పుకొనే గొప్పై
నీ గుడిసెల నిప్పై
వాడి భవన్లో నోట్ల కుప్పై
నోటికొచ్చిన తత్వమై

అమ్మ కడుపును తన్నిన
అయోమయమై
నిన్ను చంపిన వాడి
అమరత్వమై...

అమరత్వం ఆధ్యాత్మ్యం
అల్లమెల్లిగడ్డ
వాడవసరం
మన ధర్మం..
అంతా యెనకట్లాగనె
సనాతనంగా
తలొంచుకుని పాటిద్దాం
మెడలిద్దాం యేళ్ళిద్దాం
పాలిద్దాం చేళ్ళిద్దాం
వాడింట్ల కాకి
పక్కోడు కొడితే
మనం గాయపడదాం
వాళ్ళిద్దరి నదులు వాళ్ళకు
పంచుకుందాం
మన నోట్ల మట్టంతా మనదే కదా?
పెంచుకుందాం..
వంచుకుందాం
వాళ్ళిద్దరి పగలూ
పోటీలూ
మన కుండళ్ళోకి
గొంతుళ్ళోకి గుండెళ్ళోకి
బేగాని షాదిల..
అంతా అప్పట్లెక్కనే
బుద్ధున్ని కూల్చి
శివున్ని
జైనుల్ని కొట్టి
విష్ణువుకి పెడదాం
మనం వండిన ప్రసాదం
మనం అడుక్కుందాం.


4 comments:

gaddeswarup said...

Is it about some people defining themseves by hatred towards some others?

kuffir said...

yes sir, it's something like that.

Maria said...

This took me quite some time to translate, but it worth the effort. This poem is very interesting and good looking in that language. :D

Unknown said...

ఇదిగో ఇక్కడ పిచ్చి వాడి ఆక్రందన ..మంచి వాల్లంతా
వాళ్ళ వాళ్ళ ఎజండాతో ..పోరాడుతుంటే పిచ్చివాల్లంతా
అగ్గి వడిపోతున్నారు ..గడీలు కూలా లి అన్న వాళ్ళే కాపలా దార్లవుతున్నా దొర్భాగ్య కాలం ఇది
రియల్లీ ఇట్స్ మాడ్ వెర్స్
www.gurramseetaramulu.wordpress.com
--

 
Add to Technorati Favorites